ప్రజల మధ్యే చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
ప్రజల మధ్యే చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఎప్పటికీ ప్రజల మధ్యే ఉంటూ చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పక్షాన నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటరాజ్ సినిమా థియేటర్ నుంచి లింగంపెట్ వరకు ఉన్న పలు వార్డుల్లో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో యాత్రలో ఆయన పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

దారి పొడువునా మహిళలు, యువకులు, వృద్ధులు, చిరు వ్యాపారులను పలకరిస్తూనే జీవన్ రెడ్డి ముందుకు సాగారు. మరోవైపు వారి సమస్యలను తెలుసుకుంటూనే.. వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ ముందుకు కదిలారు. యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలుపుతూ కర పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం లింగంపేట లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పాలనకు నేటి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలు, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు సంక్షిప్తంగా వివరించారు. అనంతరం పలువురు యువకులు, నాయకులు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం.చారు.

Advertisement

Next Story