- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 ఏళ్లలో వారు చేయలేనిది 9 ఏళ్లలో మేము చేశాం : ముఖ్యమంత్రి కేసీఆర్
దిశ,కోరుట్ల రూరల్ : కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదు.. ధరణి పని చేయదు అంతా వెనక్కి పోవడమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం కోరుట్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తే ధరణి పోర్టల్ ను తీసుకుపోయి బంగాళాఖాతం లో వేస్తారట, ధరణిని తొలగిస్తే రైతులకు మళ్ళీ కష్టాలు మొదలు అవుతాయి, ధరణి ఆధారంగానే రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి మేము కరెంటు 24 గంటలు అందిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు 3 గంటలు సరిపోతుందంటున్నారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేనివి 9 ఏళ్లలో మేము చేసి చూపామన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 అయిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాజెక్టులతో నీళ్లు ఎక్కడ డోకా లేకుండా ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో బీడీ కార్మికులు ఇక్కడి ప్రాంతంలో చాలామంది ఉంటారని, వారి కష్టాలు చూసి పింఛన్లను 2వేలు చేసినం, కొత్త బీడీ కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తాం. నాడు బండలింగాపూర్ లో నిద్ర చేసినట్లు గుర్తుచేశారు. మండల కేంద్రాన్ని అనువైనదిగా గుర్తించి మండలంగా ప్రకటించామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రము అభివృద్ధి చెందిందన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ హయాంలో చాల అభివృద్ధి జరిగిందన్నారు. నాటి కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మాజీ స్పీకర్ నాయిని నర్సింహా రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్, నియోజకవర్గంలో మున్సిపల్ చైర్ పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.