నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం

by Sridhar Babu |
నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం
X

దిశ, కొత్తపల్లి : వచ్చే మూడు, నాలుగు నెలల్లో నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉండదని మేయర్ వై.సునిల్ రావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలో అమృత్ స్కీం పథకం కింద చేపట్టిన పైపు లైన్ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమృత్ పనులు పూర్తయితే నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య ఉండదన్నారు.

ముఖ్యంగా విలీన గ్రామాల వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి ఇక్కట్లు శాశ్వతంగా దూరం కానున్నాయని తెలిపారు. దాదాపు 150 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ లైన్, 12 కిలోమీటర్ల మేర ట్రంక్ మెయిన్, 12 చోట్ల కొత్త ట్యాంక్ నిర్మా ణం చేపడుతున్నామన్నారు. ఈ పనులు మూడు, నాలుగు నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సుదగోని మాదవి-కృష్ణ గౌడ్, 19వ డివిజన్ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story