ఎలగందల్ గ్రామానికి పూర్వవైభవం తెస్తాం: మంత్రి గంగుల

by Shiva |
ఎలగందల్ గ్రామానికి పూర్వవైభవం తెస్తాం: మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించక ముందే ఎలగందల్ జిల్లా కేంద్రంగా విరాజిల్లిందని.. తిరిగి ఆ గ్రామానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్- సిరిసిల్ల వయా ఎలగందల్ పాత రోడ్డు పునరుద్ధరణ పనులను శనివారం ఆయన పరిశీలించారు.

పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ కరీంనగర్ నుంచి ఎలగందల్ వరకు పాత రొడ్డులో ఎల్ఎండీ పై 6 వందల మీటర్ల బ్రిడ్జీ, కెనాల్ పై 60 మీటర్ల బ్రిడ్జీ, 750 మీటర్ల అప్రోచ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణం పనులు పూర్తైతే కరీంనగర్- సిరిసిల్లకు దూరం 8 కి.మీ మేర తగ్గనుందని ఆయన తెలిపారు.

బ్రిడ్జీ నిర్మాణం పూర్తైతే బ్రిడ్జీకి ఇరువైపుల నీరు ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంతో టాంక్ బండ్ తరహాలో ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎలగందల్ పరిశీలనకు విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ కు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు ఆధ్వర్యంలో యువకులు బావుపెట వద్ద ఘన స్వాగతం పలికారు. బావుపేట నుంచి ఎలగందల్ వరకు వాహనాల భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed