- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SP Ashok Kumar : ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్..
దిశ, మెట్ పల్లి : అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగలను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితులు డూప్లికెట్ కీలతో ఆసుపత్రి, బస్టాండ్ ల వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ, అమ్ముతూ జల్సాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులు నిజమాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిరాల గ్రామానికి చెందిన (A1)మన్నే లక్ష్మణ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ అలాగే నిర్మల్ జిల్లా పొనకల్ గ్రామానికి చెందిన ఇద్దరు A2) మహమ్మద్ మోసిన్,(A3) అబ్దుల్ వసీద్ లకు తక్కువ ధరకు అమ్ముతూ.. వచ్చిన డబ్బులతో జల్సా లకు పాల్పడుతున్నారని తెలిపారు. పై ద్విచక్ర వాహనాలు నిజామాబాదు, జగిత్యాల జిల్లా పోలీస్ స్టేషన్ లలో ఎఫ్ఐఆర్ నమోదయి మిస్ అయిన వాహనాలుగా గుర్తించామని అన్నారు.
జగిత్యాల జిల్లాలో (13) ద్విచక్రవాహనాలను దొంగలించగా మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో (4), కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో (1), జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో (6), రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో (1), కాగా నిజామాబాదు జిల్లాలో (7) ద్విచక్రవాహనాలు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో(3), నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో(3), కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో (1)గా తెలిపారు. కాగా శనివారం వెంకట్రావ్ పేట శివారులో వాహనాల తనిఖీల్లో భాగంగా మన్నే లక్ష్మణ్ అనే వ్యక్తి నంబర్ ప్లేట్ లేని బైక్ వస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ సొత్తును కొన్న మహమ్మద్ మోసిన్, అబ్దుల్ వసీద్ లను సైతం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొత్తం 20 ద్విచక్ర వాహనాలను స్వాదిన పరుచుకున్న ముగ్గురి పై కేసు నమోదు చేశామని తెలిపారు. చోరీ కేసును చేదించిన సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుల్ కిరణ్, సంతోష్,లను జిల్లా ఎస్పీ రివార్డుతో అభినందించారు.