- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మా వాళ్లను బతిమిలాడుకుంటా.. దయచేసి మీరు వెళ్లిపోండి'
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై స్థానికుల నిరసనల సెగలు ఆగడం లేదు. ఇప్పటికే పలుచోట్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆందోళనలు వ్యక్తం కాగా, తాజాగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోనే నిరసన వ్యక్తమైంది. పట్టణంలోని 30వ వార్డులో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా అధికారులు డ్రా తీశారు. ఈ సందర్భంగా డ్రాలో తమ పేర్లు లేవంటూ కొందరు నిరసన తెలిపారు. మరికొందరు మహిళలు జాబితాలో అనర్హుల పేర్లు చేర్చారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. అన్నింటా అర్హత ఉన్న తమ పేర్లు జాబితాలో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు మాత్రం మహిళల అభ్యంతరాలను పట్టించుకోకుండానే డ్రా ప్రక్రియను కొనసాగించారు. అర్హులకు రాకుండా, అనర్హులు పేర్లు డ్రాలో వచ్చాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన మంచె శ్రీనివాస్‌ను నిలదీశారు. మహిళలను శాంతింపజేయడానికి మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మిగతా వారికి కూడా ఇళ్ళు కట్టించే ఏర్పాటు చేస్తానని వైస్ చైర్మన్ హామీ ఇచ్చారు. ''నా వార్డు ప్రజలను బతిమిలాడుకుంటా, మీ దండం పెడతాం మీరు వెళ్ళిపొండి'' అంటూ వైస్ చైర్మన్ విలేకరులను ప్రాధేయ పడడం కొసమెరుపు.