- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కాంగ్రెస్ పార్టీతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యం..'
దిశ, కోనరావుపేట : ముదిరాజులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి అని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నీలం మధు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేయబడిన వెనుకబడిన తరగతులైన బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బీసీ కులగణనతో వెనుకబడిన కులాల జనాభా ప్రతిపాదికనకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. బీసీ కులగణన తర్వాత ఐనా ముదిరాజ్ కులస్తులకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ బిడ్డల రాజకీయ అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అన్నారు. ముదిరాజ్ లకు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి అని అది విద్యతోనే సాధ్యం అని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమానికి మత్స్య శాఖ నుండి 50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డలకు పెద్దపీట వేస్తున్న ముదిరాజు కులానికి 1000 కోట్లు నిధులతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అన్నారు. జిల్లా మిడ్ మానేరు జలాశయంలో ముదిరాజులు చేపలు పట్టుకొని అమ్ముకునే విధంగా మత్స్య పరిశ్రమ సహకారం శాఖ ఆధ్వర్యంలో అన్ని వసతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
మధ్యతరగతి భావజాలానికి అధికారం వచ్చింది కాబట్టే తాను మధ్యతరగతి వారిని ఆదుకోగలుగుతున్నానని, అందులో భాగంగా ముదిరాజ్ కులస్తులను తన కడుపులో పెట్టుకొని చూసుకుంటానని అన్నారు. ప్రతి సమస్యలో తాను అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమాన్ని రక్షిస్తానన్నారు. మనమెంతో మనకు అంత అన్న ముదిరాజ్ సోదరుల మాటను తాను ఏకీభవిస్తూ ప్రతి ముదిరాజ్ బిడ్డలకు అండగా ఉంటూ బీసీ డి నుండి బీసీ ఏ రిజర్వేషన్ కొరకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే విద్యతోనే సాధ్యం అని అందుకు పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. అనంతరం తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కీసారి శ్రీనివాస్, ఫిషరీస్ వైస్ చైర్మన్ అంబటి శేఖర్, ఉపాధ్యక్షులు కోలకానీ నాగరాజ్, బొండ్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయలు ఎల్లయ్య , బొయిని దేవరాజు, పండుగ స్వామి, అన్నాబోయిని సురేష్ గండి నరేష్, వివిధ గ్రామాల ముదిరాజ్ సోదరులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.