- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగ రహిత రామగుండంగా తీర్చిదిద్దాలనే నా లక్ష్యం : ఎమ్మెల్యే
దిశ,గోదావరిఖని : రామగుండం నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నది నా తపన నా లక్ష్యం అని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ నేతృత్వంలో టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళా కు గోదావరిఖని రామగుండం పాలకుర్తి అంతర్గాం మండలాకు చెందిన వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు.హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చెందిన 30 కంపెనీలు మెగా జాబ్ మేళ లో పాల్గొన్నాయి. మెగా జాబ్ మేళా లో పాల్గొని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఉద్యోగులు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగుల అంతా జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని సమాజంలో గౌరవంగా ఎదగాలన్నారు. మంచి వృత్తిని ఎన్నుకొని చిత్తశుద్ధితో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయమన్నారు. రామగుండం నియోజకవర్గం లోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకు తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాగా మీకు ఒక అన్న లాగా అండదండగా ఉంటానని చెప్పారు.
రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగుల ఉద్యోగ కల్పన కోసం 2020 సంవత్సరం లో గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా ను నిర్వహించామని గుర్తుచేశారు. ఇటీవల రామగుండం దశాబ్ది ప్రగతి సభలో పాల్గొన్న రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను టాస్క్ ద్వారా గోదావరిఖని లో మెగా జాబ్ మేళా ను నిర్వహించాలని కొరిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి ఇక్కడ టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను ఏర్పాటు చేయించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్రాంతంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ నాయకులు కౌశిక హరి టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్షా ప్రతినిధులు ప్రదీప్ రెడ్డి అనిల్ అభిషేక్ రెడ్డి కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చ వేణు పిల్లి రమేష్ విజయమ్మ ఫౌండేషన్ బాధ్యులు ఎడెల్లి శ్యాం అబ్బ రమేష్ తదితరులు పాల్గొన్నారు.