- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు కన్నీరు మిగిల్చిన ప్రభుత్వ ఒక్క నిమిషం నిబంధన!
దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒక నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అయినప్పటికి జగిత్యాలలో ఓ ముగ్గురు ఎగ్జామ్ సెంటర్‌కి సరైన టైంలో చేరుకోలేకపోయారు. దీనీతో నిమిషం నిబంధన కారణంగా ఆ విద్యార్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించలేదు.
అయితే బస్సు ఆలస్యంగా రావడంతోనే లేట్ అయిందని ఓ విద్యార్థిని అధికారులకు విన్నవించినా నిమిషం నిబంధన ఉన్న కారణంగా అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఘటనపై స్పందించిన నోడల్ ఆఫీసర్ నారాయణ మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులను ముందుగానే చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరతానని తెలిపారు. విద్యార్థులు కూడా పరీక్షలు జరిగినన్ని రోజులు త్వరగా బయలుదేరి ఎగ్జామ్స్ సెంటర్ కు చేరుకునే విధంగా ముందు జాగ్రత్త పడాలని సూచించారు.