రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

by S Gopi |   ( Updated:2023-02-23 10:17:30.0  )
రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: చౌక ధరల దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను పారదర్శకంగా అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణంలో ప్రగతి నగర్ లోని చౌక దారల దుకాణాలను ఆజాది అమృత్ మహోత్సవం భాగంగా జిల్లా కలెక్టర్ అకస్మాత్ తనిఖీలు చేశారు. ప్రజలకు పారదర్శకంగా రేషన్ అందుతుందా? పంపిణీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా? అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీని తెలుసుకున్నారు.


దుకాణంలో నిర్వహించే స్టాక్ రిజిస్ట్రేషన్ స్టాక్ తెలిపే బోర్డులు, బయోమెట్రిక్ ఈపాస్ యంత్రాలను, రిజిస్ట్రేషన్ ప్రకారం ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా షాపుల్లో ఎంతమంది లబ్ధిదాలు ఉన్నారనే వివరాలను అక్కడి అధికారులను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. బియ్యం క్వాలిటీ గురించి అడిగారు. ఒకే దేశం -ఒకే రేషన్ అమలును తీరును పరిశీలించారు. లబ్ధిదారులకు సకాలంలో రేషన్ బియ్యం పారదర్శక విధానాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహశీల్దార్‌ విజయ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, డీలర్‌ సాగాల విజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story