- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపం చిన్నారి.. మూడేళ్ల బాలికపై వీధి కుక్కదాడి
దిశ ,ఓదెల: వీధి కుక్క మూడేళ్ల బాలికతో పాటు మరో ముగ్గురిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఓదెల మండల కేంద్రానికి చెందిన కనికి రెడ్డి దిహాసిని(3) బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఇంటి ముందు నుంచి వెళ్తున్న వీధి కుక్క అకస్మాత్తుగా బాలికపై దాడి చేయగా ఎడమ చెంపపై తీవ్ర గాయం అయింది. అలాగే మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కొట్టే భవాని పై దాడి చేయగా ఎడమ కాలుకు మూడు చోట్ల గాయాలయ్యాయి.
పంచాయతీరాజ్ ఏఈ దగ్గర అసిస్టెంట్‌గా సాతూరి మహేష్‌ను, అలాగే మెనుగు కొమురయ్యలపై దాడి చేయగా ఓదెల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చి కుక్కకాటు ఇంజక్షన్లు తీసుకున్నారు. కనికి రెడ్డి దిహాసిని అనే బాలికను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఓదెల వైద్య అధికారి రిఫర్ చేశారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రోదనలు చూసి ఆసుపత్రికి వచ్చిన ప్రజలు బాధను వ్యక్తం చేశారు.
ఆ చిన్నారి గాయాన్ని చూసి అక్కడున్న ప్రజలు చలించిపోయారు. ఓదెల మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు బయటికి వెళ్తే వీధి కుక్కలు భయపెడుతున్నాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మండలంలోని గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు , ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని వీధి కుక్కలను చంపాలని మండల ప్రజలు కోరుతున్నారు.