- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసుల్లో శిక్షల శాతం పెంచాలిః ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసు ఆఫీసులో గురువారం జిల్లా పోలీసు అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టులలో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో హిస్టరీ, రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యహరించాలన్నారు. నేర పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత ను ప్రజలకు అవగాహన కల్పిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండ ఫ్లెక్సీలు ఏర్పటు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలనిజిల్లా ఎస్పీ అన్నారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా డిజే ఉపయోగించినట్లు అయితే కేసులు నమోదు చేసి డిజే లు సీజ్ చేయాలని ఆదేశించారు. వివిధ కారణాలతో రోడ్ల మీదకు వచ్చి రాస్తా రొక, దార్నా ల పేరుతో ప్రజా రవాణాకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే జిల్లాలో అక్రమ గంజాయి రవాణా, గుడుంబా, అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ రైస్ లపై ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ లపై, నిబంధనలకు విరుద్ధంగా సైరైన్ ఉపయోగించే వాహనాలపై దృష్టి సారించాలన్నారు. సమీక్షలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, సిఐ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, ఐటీ కోర్ సిబ్బంది, పాల్గొన్నారు.
- Tags
- space
- Crime Spot