- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు లింగమూర్తి కన్నుమూత
దిశ, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లింగమూర్తి గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. లింగమూర్తి ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించగా బీపీ తక్కువ ఉండటంతో ఆసుపత్రికి వెళ్లాలని సూచించడంతో బయటకు వచ్చి ఒక్కసారిగా రోడ్డు మీద కుప్పకూలిపోయారు.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు లింగమూర్తిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా లింగమూర్తి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. ప్రస్తుతం ఓదెల మండల దిశ రిపోర్టర్‌గా పనిచేస్తున్న లింగమూర్తి పని చేస్తున్నారు. మృతుడు లింగమూర్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. లింగమూర్తి మృతి పట్ల దిశ ఎడిటర్ మార్కండేయ, నెట్ వర్క్ ఇంచార్జ్ ప్రవీణ్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణరావుతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.