ఆ విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన R. S. Praveen Kumar

by S Gopi |   ( Updated:2022-12-16 08:20:59.0  )
ఆ విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన R. S. Praveen Kumar
X

దిశ, శంకరపట్నం: ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు నోట్ల కట్టలతో వచ్చి బహుజనుల ఓట్లు దండుకుని, రాజ్యాధికారం చేపట్టి బహుజనులకు దక్కాల్సిన ప్రభుత్వ ఫలాలను అందకుండా చేస్తున్నారని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర శంకరపట్నం మండలం చేరుకుంది. ప్రవీణ్ కుమార్ కు మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, మండల అధ్యక్షుడు కన్వీనర్లు భాస్కర్, చందు, సంపత్, తాడికల్ లో ఘన స్వాగతం పలికి, పూలమాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి, యాత్రను కొనసాగించారు. శంకరపట్నం మండలం తాడికల్, వంకాయగూడెం, కేశవపట్నం, మక్త గ్రామాల్లో యాత్ర నిర్వహించి మక్తలో, గ్రామ కన్వీనర్ తాళ్లపల్లి సురేష్ కుమారుడికి పరాక్రమ్ అని నామకరణం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బహుజనులను 75 ఏళ్లు నుండిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో నోట్ల కట్టలతో వచ్చి ఓట్లను దండుకుని బహుజనులను రాజ్యాధికారం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను సాధించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులు మేలుకుని ఎన్నికల్లో తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుని ఏనుగు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.

బహుజన తల్లిదండ్రులు కూలీగా నాటి నుండి నేటి వరకు కూలీ నాలి చేస్తున్నారని, బహుజన బిడ్డలు ఉన్నత చదువులు చదివి విదేశాలకు తల్లిదండ్రులు కూలీగా ఉన్న కంపెనీలకు మీ బిడ్డలు యజమానులు కావాలంటే బహుజన రాజ్యాధికారం రావాలని పిలుపునిచ్చారు. ఓట్ల కట్టలను తిప్పి కొట్టి బహుజన రాజ్యాధికారం కోసం ఏనుగు గుర్తును అక్కున చేర్చుకోవాలని మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, కార్యవర్గ సభ్యులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాతంగి మారుతి, నియోజకవర్గ అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, మండల కన్వీనర్లు, భాస్కర్, చందు, సంపత్, తోపాటు జిల్లా, మండల, గ్రామ కన్వీనర్లు, నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed