- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోతుల బెడద సమస్యను పరిష్కరించండి.. అధికారులకు వినతి
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో కోతుల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు గురువారం వినతిపత్రం అందజేశారు. పట్టణంలో కోతుల బెడద అధికంగా ఉందని, ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. ప్రతినిత్యం కోతులు ఎవరినో ఒకరిని గాయపరుస్తున్నాయని, వందల సంఖ్యలో కోతులు రోడ్ల పై, గోడలపై ఇళ్ల పై యధేచ్చగా సంచారం చేస్తూ మహిళలు, వృద్ధులు, పిల్లలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, రెవెన్యూ, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇతర కార్యాలయాలకు వచ్చే సందర్శకులు, ఇందిరా మార్గంలోని వ్యాపారులు కోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా ఈ సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారని, మున్సిపాలిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కోతుల బెడదను నివారించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో 26 వ వార్డు యూత్ నాయకులు తిప్పబత్తిని విజయ్, పళ్ళ కిషోర్ లు ఉన్నారు.