- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాజపాయినగర్ ఆర్యూబీ పనులు ప్రారంభించాలి
దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ వాజపాయినగర్ ఆర్యూబీ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ స్థానికులు గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత పదకొండు నెలలుగా వాజపాయినగర్ రైల్వే బ్రిడ్జి వద్ధ ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. చిత్తశుద్ధిగా పని చేస్తున్న ఎమ్మెల్యేకు ఈస్ట్, సౌత్ కాకతీయ నగర్ కాలనీవాసులు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ గెలిచిన మొదటి రోజు నుండే రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. అధికారులు మొదట 178 ఇండ్లను కూల్చాలని నివేదిక ఇచ్చారని, దాంతో వారితో మాట్లాడి రైల్వే స్థలం నుండి అలైన్మెంట్ చేయించి కేవలం 4 నుండి 5 ఇండ్లు మాత్రమే పాక్షికంగా కూల్చేలా ప్రణాళిక సిద్ధం చేయించినట్టు చెప్పారు. ఆర్యూబీ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. కార్యక్రమంలో బద్దం పరశురామ్ రెడ్డి, చందు, శ్రీనివాస్, సూరి, బాలకృష్ణ, ఫరీద్ ఉన్నారు.