- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామగుండంతో దేశానికే వెలుగులు
దిశ, గోదావరిఖని : దేశానికి వెలుగులు పంచుతుంది మన రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నారు. ఎన్టీపీసీకి భూములు దానం చేసి వారు స్థిర స్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎన్టీపీసీ 40 సంవత్సరాల వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని జోహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ వారోత్సవాలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రామగుండం ప్రాంతం నుండి సింగరేణి సంస్థ, ఎన్ టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ద్వారా మన రాష్ట్రానికి ఎన్నో వనరులను అందిస్తుందని పేర్కొన్నారు. రామగుండంలో అతి త్వరలోనే 800 మెగా విద్యుత్తు ప్లాంట్ ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఇక్కడి ప్రాంత యువకులకు నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.