heavy rains : ముసురేసిన వాన.. తహశీల్దార్ కార్యాలయంలో వర్షం నీరు..

by Sumithra |
heavy rains : ముసురేసిన వాన.. తహశీల్దార్ కార్యాలయంలో వర్షం నీరు..
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం పాతభవనం కావడంతో, అది పూర్తిగా శిథిలమై కూలిపోయే స్థితిలో ఉంది అదేవిధంగా ఎప్పుడు వర్షాలు కురిసిన కార్యాలయంలోనికి ఊట నీళ్లు చేరి కురుస్తూ, ఆఫీస్ సిబ్బందికి, తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, నాయకులకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. వర్షాల ప్రభావంతో ఆఫీసులోని అప్పుడప్పుడు విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుందని ఆఫీస్ సిబ్బంది తరచూ భయభ్రాంతులకు లోనవుతూ కార్యాలయం పనులు చేయాల్సి వస్తుందని అనుకుంటున్నారు.

ఇటీవల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రానికి మంత్రుల బృందం పర్యటించడంతో సమస్య దృష్టిలో ఉంచుకొని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ నూతన తహశీల్దార్ భవనాన్ని మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆఫీసులోకి నీరు చేరుతుంది. కనుక జిల్లా కలెక్టర్ సంబంధిత మంత్రివర్యులు వెంటనే చొరవ తీసుకొని నూతన తహశీల్దార్ భవనాన్ని మంజూరు చేయాలని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed