ఎమ్మెల్యే రసమయి ఎదుట బయటపడ్డ వర్గ పోరు

by S Gopi |
ఎమ్మెల్యే రసమయి ఎదుట బయటపడ్డ వర్గ పోరు
X

దిశ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా మానకొండూర్ వర్గం శంకరపట్నం మండలంలోని, కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎదుట సర్పంచ్, ఎంపీటీసీ మధ్య వర్గపోరు బట్టబయలైంది. కన్నాపూర్ గ్రామంలో సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి, గ్రామ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి, ఆమె భర్త, శంకరపట్నం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు మోతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రసమయి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరుకావడంతో గ్రామ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి తమను ఆహ్వానించకుండా గ్రామ సర్పంచ్ కాట వెంకట రమణారెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే రసమయి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేసి వేణు తిరిగి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి మాట్లాడారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి రాజ్యాంగబద్ధంగా ప్రజా ఆదరణతో కన్నాపూర్, ముత్తారం రెండు గ్రామాల ప్రజలు ఓటర్లు హక్కుల చేర్చుకుని ఎంపీటీసీగా తమను గెలిపిస్తే కన్నాపూర్ గ్రామ సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి, ప్రొటో కాల్ పాటించకుండా అధికార ప్రోగ్రాంలకు, కార్యక్రమాలకు తమను ఆహ్వానించడంలేదని ఎమ్మెల్యే రసమయికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమకారులైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి తాను ఉద్యమంలో ముందుండి పోరాటం చేశామని గుర్తు చేశారు. తను కన్నాపూర్ ఎంపీటీసీగా, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడిగా మండలం పరిధిలోని గ్రామాల్లో సేవలందించానని, మండల ప్రజలు తనకు ఇప్పటికీ మంచి గుర్తింపు ఇస్తారని కానీ, కన్నాపూర్ గ్రామ సర్పంచ్ కాటం రమణారెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తూ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించాలని భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed