పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్.

by Shiva |
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్.
X

దిశ, జగిత్యాల:శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జగిత్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఆయన నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త కేసులతో పాటు చాలాకాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వల్ల కేసుల సంఖ్య తగ్గేలా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

నేర నియంత్రణలో భాగంగా ప్రతి పట్టణంలోని కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. మరోవైపు రానున్న రంజాన్, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకునేలా భద్రత పరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలోమతపరమైన విద్వేశాలకు సంబంధించి పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, ఎస్బీ డీఎస్పీ రవీంద్ర కుమార్, సీఐలు కిషోర్, రమణమూర్తి, కోటేశ్వర్, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story