TRSతో రాష్ట్రాన్ని ముంచేశారు.. ఇప్పుడు దేశాన్ని ముంచడానికే BRS : NVSS Prabhakar

by Mahesh |   ( Updated:2022-12-14 06:29:21.0  )
TRSతో రాష్ట్రాన్ని ముంచేశారు.. ఇప్పుడు దేశాన్ని ముంచడానికే BRS : NVSS Prabhakar
X

దిశ, శంకరపట్నం: ప్రత్యేక తెలంగాణ అంటే ఆ నలుగురే అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవహరించి, నేడు దేశ ప్రజలను మోసం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ పేరుతో ముందుకు సాగుతున్నాడని, తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు , కరీంనగర్ జిల్లా ఇన్చార్జి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో, శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్ట పై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయంలో ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, మీడియా మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో అన్ని వర్గాల వారు ముందుండి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో, తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబంలొరి ఆ నలుగురు వ్యక్తులు కాదని.. తెలంగాణ నాలుగు కోట్ల మంది జనం అని కేసీఆర్ కుటుంబాన్ని పరోక్షంగా ఎద్దేవా చేశారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలను నామమాత్రంగా ప్రకటిస్తూ.. యువతను మోసం చేస్తున్నాడని, తెలంగాణలో అనేక సమస్యలతో ప్రజలు ఉన్నారని, రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజా సంక్రమ యాత్ర 15 గురువారం రోజు ముగింపు బహిరంగ సభ కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ముగింపు మహాసభకు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తో పాటు బీజేపీ పార్టీ కేంద్ర, రాష్ట్ర, వివిధ జిల్లాల, నాయకులు, ముఖ్య అతిథులుగా హాజరవుతారని ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కోసం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు యువత అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య, మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి అలివేలి సమ్మి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, దళిత మోర్చ మండల అధ్యక్షుడు సాగర్ జి, ఎస్టీ మోర్చా బిజిలి సారయ్య, నాయకులు దండు కొమురయ్య, శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, జైపాల్, సంపత్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read....

బీఆర్ఎస్ అల్లరి మూకల్లా పోలీసుల దాడులు : రేవంత్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed