- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పౌష్టికాహారం సక్రమంగా అందించాలి : కలెక్టర్ బి.సత్యప్రసాద్
దిశ, రాయికల్ : గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు అంగన్వాడి సెంటర్ ద్వారా పౌష్టికాహారం అందజేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం రోజున రాయికల్ మండలంలోని మహితపూర్ అంగన్ వాడి సెంటర్ ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారు రోజు వస్తున్నారా అని వారి హాజరు పట్టికను పరిశీలించారు.
ప్రతి రోజు వారికి ఇచ్చే ఆహార మెనూను, వయస్సుకు తగ్గట్టుగా పొడవు, బరువు ఉన్నారా అని తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టికాహారం, బాలామృతం ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడి సెంటర్లో గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారు, వారి వివరాలు వారికి పంపిణీ చేసే పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహితపూర్ గ్రామంలో నర్సరీ ని సందర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు, పూల మొక్కలు పెంచాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో మధు సుధన్ ,ఈ ఈ ప్రేమ, అబ్దుల్ రెహమాన్, ఎమ్మార్వో, ఎంపీడీవో ,ఎంపీ ఓ తదితరులు ఉన్నారు.