Bihar : బీహార్‌లో స్కూల్ టైమింగ్ చేంజ్.. రీజన్ ఇదే..!

by Sathputhe Rajesh |
Bihar : బీహార్‌లో స్కూల్ టైమింగ్ చేంజ్.. రీజన్ ఇదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : చలి తీవ్రత కారణంగా బీహార్‌లోని ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని మార్పు చేశారు. ఈ మేరకు గురువారం బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు నడపాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎస్. సిద్ధార్థ్ మార్గదర్శకాలను జారీ చేశారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 8.50 నుంచి 4.30వరకు కొనసాగేవి. రివైజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫస్ట్ బెల్ 10 గంటలకు మోగనుంది. చివరి బెల్ 4 గంటలకు మోగుతుంది. మధ్యాహ్నం 12 నుంచి 12.40 గంటల వరకు లంచ్ బ్రేక్‌కు కేటాయించారు. మొత్తం ఎనిమిది పిరియడ్స్ నిర్వహిస్తారు. రెగ్యులర్ క్లాసులకు బోర్డు ఎగ్జామ్ ల కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యార్థులు, స్టాఫ్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story