- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adani : అదానీ సంస్థలపై ఆరోపణలు.. సీపీఐ(ఎం) సంచలన డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో : అదానీ గ్రూప్ కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. అదానీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆమోదించేందుకు ముడుపులు ఇవ్వ చూపారని ఆరోపణలు రాగా సీపీఐ(ఎం) ఈ మేరకు స్పందించింది. మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కాపాడుతోందని ఆరోపించింది. మరోవైపు అదానీ గ్రూప్ సంస్థ మాత్రం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ చేసిన ఆరోపణలను ఖండించింది. గౌతమ్ అదానీతో పాటు మరో ఆరుగురిపై నేరారోపణలను సీరియస్‌గా పరిగణించాలకి కమ్యూనిస్ట్ పార్టీ కోరింది. అమెరికా ప్రాసిక్యూషన్ అందించిన సమాచారం మేరకు సీబీఐ వెంటనే ఈ ఉదంతంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వచూపడం ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కిందకు వస్తుందని ఆ పార్టీ తెలిపింది. ఈ కేసు సీబీఐ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. స్వతంత్ర ఏజెన్సీతో సమగ్ర విచారణ చేయిస్తే అదానీ గ్రూప్ చేస్తున్న అవకతవకలు బయటపడతాయని పేర్కొంది. యూఎస్ ప్రభుత్వం తమ కంపెనీలను కాపాడుకుంటుంటే బీజేపీ మాత్రం అదానీ గ్రూప్ కంపెనీలను కాపాడుతుందని పార్టీ నేత బ్రిందా కారత్ ఆరోపించారు. అవినీతి ఆరోపణల దృష్ట్యా అదానీపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హిండెన్ బర్గ్ అంశంలో కూడా మోడీ ప్రభుత్వం అదానీని కాపాడినట్లు ఆమె ఆరోపించారు. భారతదేశ వనరులను దోచుకునేందుకు అదానీ కంపెనీలకు అనుమతులు, లైసెన్సులను మోడీ ప్రభుత్వం ఇస్తోందన్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని కాపాడి ప్రపంచ దేశాలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ఫైర్ అయ్యారు.