- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Black Roses : నల్ల గులాబీ.. ఎల్లలు దాటీ..
దిశ, ఫీచర్స్ : గులాబీ పూలు అంటేనే.. అందరికీ వెంటనే గుర్తొచ్చేది వాటి రంగు, సువాసన. ప్రస్తుతం ఎక్కడ చూసినా రెడ్, పింక్, ఎల్లో, వైట్ కలర్ గులాబీలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాగా వీటిలో బ్లాక్ లేదా వెల్వెట్ కలర్‌వి కూడా ఉంటాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అంతటా కనిపించవు. కొన్ని ప్రాంతాల్లోనే పూసే ఈ పూవులను అక్కడి సాగుదారులు ఇప్పుడిప్పుడే ఎల్లలు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కలర్ నలుపే అయినప్పటికీ వాసన మాత్రం పరిమళ భరితం అంటారు. ఇంతకీ ఈ నల్ల గులాబీల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.
30 వేల రకాలు
గులాబీల్లో రంగులే కాదు, రకాలు కూడా అనేకం. దాదాపు 150 రకాల అడవి జాతి గులాబీలు ఉండగా, మానవులు సృష్టించిన హైబ్రిడ్ రకాలే సుమారు 30 వేల వరకు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇక వీటిలో అతిపెద్ద గులాబీ 33 ఇంచులు మొదలు కొని, బియ్యపు గింజ సైజుతో కూడిన చిన్న గులాబీ వరకు ఉన్నాయి. తీగ జాతులు, మొక్క జాతులు కూడా ఉన్నాయి. కాగా ప్రపంచంలో అరుదుగా ఉండటం కారణంగా నల్ల రంగు గులాబీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా నల్ల గులాబీ, కొన్ని ప్రాంతాల్లో నేల రకాలను బట్టి వెల్వెట్ కలర్‌లోనూ ఉంటుంది. కానీ అందరూ నల్ల గులాబీగానే పిలుస్తుంటారు. అయితే అన్ని దేశాల్లో మాత్రం కనిపించదు. కేవలం టర్కీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పూల మొక్కలు పెరుగుతాయని, అక్కడి రైతులు సాగు చేస్తారని నిపుణులు అంటున్నారు.
టర్కీలో పుట్టి.. ప్రపంచాన్ని చుట్టి
ఇటీవల సంవత్సరాల్లో ప్రకృతిలో మొక్కల్లో వైవిధ్యం, పర్యావరణ సామరస్యాన్ని ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ రోజ్ యూనియన్ టర్కీలోని ఓ ప్రధాన నంగరంలో పూచే నల్ల గులాబీలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆగ్నేయ ప్రావిన్స్‌లోని హాల్ఫెటి జిల్లాలోని కొన్ని నేల రకాల్లో మాత్రమే సహజంగా పెరుగుతుందట. మార్చి - ఏప్రిల్, అక్టోబర్ - నవంబర్ మాసాల్లో ఎక్కువగా పూస్తుంటాయి. మొదట టర్కీలో పుట్టిన నల్లగులాబీ ప్రస్తుతం ఎల్లలు దాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా ఇవి కనిపిస్తున్నప్పటికీ టర్కీలోని బ్లాక్ రోజెస్ లాంటివి కావంటున్నారు నిపుణులు.