CM KCRపై MP Aravindh మరోసారి ఆగ్రహం

by S Gopi |   ( Updated:2022-12-15 11:38:16.0  )
CM KCRపై MP Aravindh మరోసారి ఆగ్రహం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్స్ రాకముందే టీఆర్ఎస్(BRS)పార్టీని పంపించేశారు. తెలంగాణ జాగృతి... ఇప్పుడు భారత్ జాగృతి అయిందంట. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చింది కాంగ్రెస్ తో కలిసేందుకే. కాంగ్రెస్ కార్యకర్తలకు సోయిచ్చింది. నాయకులకే రావాలి. ఇక్కడ దోచుకున్న సొమ్మును తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ కు అప్పగించాలన్న డీల్ ను కాంగ్రెస్ తో కుదుర్చుకున్నాడు. కాంగ్రెస్ లో బీ ఫామ్ లు ఇచ్చేది కూడా కేసీఆరే. బీఆర్ఎస్ పార్టీ అంటే... తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూఫ్ ని చేయడమే తప్ప, ఇంకా ఏమీ లేదు. ప్రధాని వచ్చినా... స్వాగతం పలకడు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీతో దేశమంతా తిరుగుతాడట... ఇక కేటీఆర్ కు ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తాడట. ఈ కేటీఆర్ అనేటోడు... సాఫ్ట్ వేర్ వాళ్ళతో, బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతడు. నైట్ లు మ్యూజిక్ వింటడు.

లిక్కర్ లేడి నా ఇంటిపైకి గుండాలను పంపింది. ఆంధ్రా ఎంపీ నాతో పార్లమెంట్ లో ఈ భారత్ జాగృతి ఏంటి అని అడిగాడు. కవిత తలుచుకుంటే... మైక్ టైసన్ కు బాక్సింగ్, విరాట్ కోహ్లీకి క్రికెట్ నేర్పుతది. నన్ను వెంటాడి, వేటాడి నా మీద నిలబడతా అన్న కవిత.. ఇప్పుడు అయ్య ఎక్కడ చెప్తే అక్కడే అంటోంది. నీకు భయం ఉంటే... నువ్వు నిలబడు, లేకపోతే నాపై మీ అయ్యను నిలబెట్టు. ఎలక్షన్స్ లో పెట్టే ఖర్చును రూ.100 కోట్లకు తీసుకెళ్లింది ఈ బీఆర్ఎస్ పార్టీ. అవినీతి రహిత పాలన రావాలంటే.... బీజేపీ రావాలి' అంటూ ఆయన మండిపడ్డారు.

Also Read...

కేటీఆర్ కుమారుడితో సెల్ఫీ కోసం ఎగడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు!

Advertisement

Next Story