- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య
దిశ, వెబ్ డెస్క్/ గొల్లపల్లి/జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని(58) గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఉదయం గ్రామంలో బైక్ పై వెళుతున్న గంగారెడ్డిని మొదట కార్ తో వెనుక నుండి ఢీ కొట్టి కింద పడగానే కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. కుటుంబ సభ్యులు గంగారెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృత్యువాత పడ్డాడు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న గంగారెడ్డి హత్య జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి హత్యకు పాల్పడిన నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న గంగారెడ్డిని మర్డర్ చేస్తే తనను కూడా హత్య చేసిన దాంతో సమానం అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన చేపట్టడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను బైపాస్ రోడ్డు గుండా మళ్ళించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామం తో పాటు జగిత్యాల లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ హత్యకు భూ వివాదాలు కారణమా లేక రాజకీయ కక్ష్యలతో జరిగిందా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.