- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే? (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అక్కినేని అఖిల్ (Akhil)సరసన ‘హలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)తో ‘చిత్రలహరి’ మూవీ చేసి మంచి క్రేజ్ దక్కించుకుంది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. దీంతో అమ్మడుకి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రజెంట్ ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీరామ్ కస్తూరి మాన్(Sriram Kasturiman), కళ్యాణి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీరామ్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ‘అవును.. ఈ క్షణాలు మమ్మల్ని సంతోష పరుస్తాయి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇది ఓ యాడ్‌కు సంబంధించింది అని అర్థమవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో కళ్యాణి తల్లిదండ్రులు, సన్నిహితులు ఎవరూ కనిపించలేదు.
కాగా, శ్రీరామ్(Sriram Kasturiman)కు వందితతో పెళ్లి జరిగింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అలాంటిది కళ్యాణితో పెళ్లి చేసుకున్న వీడియోను శ్రీరామ్ షేర్ చేయడంతో అంతా అయోమయంలో పడిపోయారు. వరుస పోస్టులు పెట్టి నిజంగానే పెళ్లి చేసుకున్నారా అని అడగడంతో ఆయన అసలు విషయం చెప్పారు. ఓ యాడ్ కోసం చేసిందని నిజంగా నాకు, కళ్యాణికి వివాహం కాలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ కళ్యాణి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
👉 Also Read: పెళ్లి కాకుండానే నాగార్జున, అమలకు బిగ్ షాకిచ్చిన శోభిత..?