Britney Spears: నాలుగో పెళ్లి చేసుకున్న పాప్ సింగర్.. ఇలాంటి ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు?

by Prasanna |   ( Updated:2024-10-22 06:39:44.0  )
Britney Spears: నాలుగో పెళ్లి చేసుకున్న పాప్ సింగర్.. ఇలాంటి ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడానికే పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఉంది. ఒకప్పుడు ఈ బంధం ఒకరితోనే ముడిపడి ఉంటుందని అనేవాళ్లు.. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ఒకరి దగ్గరి నుంచి మొదలయి ఒక్కొక్కరు రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా, హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ కూడా నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

బ్రిట్నీస్పియర్స్‌ (Britney Spears) 42 ఏళ్ల వయసులో తనను తానే పెళ్లాడింది. పైగా, ఇదే విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. " ఈ రోజు నేను ఒక గొప్ప పనిని చేశాను.. నన్ను, నేనే పెళ్లి చేసుకున్నాను , చూసే వాళ్ళందరికీ ఇది మంచిగా అనిపించకపోవచ్చు కానీ, నాకు మాత్రం ఇది ఒక చాలా ముఖ్యం. నా జీవితంలో చేసిన గొప్ప పని ఏదైనా ఉంది అంటే.. అది ఇదే..! " అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇలా స్వీయ వివాహం చేసుకున్న బ్రిట్నీస్పియర్‌ను చూసి నెటిజన్లు షాక్ అయి ఇంకా ఎన్ని వింతలు చూడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story