- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్..నలుగురు విద్యార్థినులకు గాయాలు
దిశ, మెదక్ ప్రతినిధి : విద్యుత్ షాక్ తగిలి నలుగురు విద్యార్థినులకు గాయాలైన ఘటన హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి రావ్ పూలే గురుకుల పాఠశాల లో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. జిల్లా స్థాయి గురుకుల క్రీడా పోటీలకు గురుకుల పాఠశాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ ఫ్లాగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో రాడ్ పట్టుకున్న రజిత, వసంత, అనుష్క, గాయత్రి ల చేతులకు షాక్ కొట్టింది. దీంతో వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చేతులకు గాయాలైనట్లు తెలిపారు. రజిత ఇంటర్ చదువుతుండగా మిగతా విద్యార్థినిలు పదో తరగతి వారు ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థులను పరామర్శించిన ఆర్డీవో..
విద్యుత్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మెదక్ ఆర్డీవో రమాదేవి పరామర్శించారు. ప్రమాదం పై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.