Boreddy Ayodhya Reddy: 'నీ దగ్గర విజ్ఞత, గౌరవం ఆశించడం అత్యాశే'.. కేటీఆర్ కు సీఎం పీఆర్వో కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-10-22 12:37:14.0  )
Boreddy Ayodhya Reddy: నీ దగ్గర విజ్ఞత, గౌరవం ఆశించడం అత్యాశే.. కేటీఆర్ కు సీఎం పీఆర్వో కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు అధికారం నుంచి దించినా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో ఏ మాత్రం గర్వం, అహంకారం తగ్గలేదని ముఖ్యమంత్రి పీఆర్వో అయోధ్యరెడ్డి బోరెడ్డి విమర్శించారు. కేటీఆర్ మారడు, ఆయన మారలేడు. ఇప్పటికీ అరగెన్స్.. అంతే ఆటిట్యూడ్.. ఆయనకు జర్నలిస్టుల మీద ఈ అక్కులు ఎందుకు?' అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అయోధ్యరెడ్డి పోస్టు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల నుంచి, ప్రెస్ మీట్లలో వెక్కిరింపుల దాక ప్రతి చోటా జర్నలిస్టులకు అవమానాలేనని ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులంటే అదే చులకన భావం అని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నంత కాలం జర్నలిస్టులను కనీసం మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదని, కనీసం నాడు కాంగ్రెస్, వైఎస్సార్ ఇచ్చిన ఇండ్ల స్థలాలను స్వాధీనం చేయడానికి మనసొప్పకపోగా ఆ సైటును ఆయన స్నేహితులకు ఇవ్వాలని చూశారని ఆరోపించారు.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను సియోల్ నగరం తీసుకెళ్తే వ్యంగ్యంగా వ్యాఖ్యానించి మరోసారి మీ తలబిరుసుతనం చూపించడం సహేతుకమేనా? అని నిలదీశారు. కేటీఆర్ వద్ద విజ్ఞత, గౌరవం ఆశించడం అత్యాశేనని మీ అహంకార్ని మరోసారి నిరూపిస్తోందని ఫైర్ అయ్యారు. కేటీఆర్ లో అదే అహంకారం అంతే అహంభావం ఉందని దుయ్యబట్టారు. జర్నలిస్టులను తానేమి అవమానించలేదంటూ కేటీఆర్ నిన్నటి ప్రెస్ మీట్లో వివరణ ఇవ్వగా అంతకు ముందు సియోల్ టూర్ పై ప్రభుత్వం ఇచ్చిన జీవో పై ఆయన స్పందిస్తూ చేసిన ట్వీట్ ను అయోధ్యరెడ్డి ఈ పోస్టులో జత చేశారు.

Advertisement

Next Story