- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Viral Video: ముఖ్యమంత్రితో స్పెషల్ బ్లాగ్.. బాలిక మాటలకు అబ్బురపోయిన సీఎం
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ సీఎం డా.మోహన్ యాదవ్ తో 12 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ బ్లాగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అందులో తమ వాక్చతురతతో బ్లాగులు చేసి ఫేమస్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఛతర్పూర్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బిన్ను రాణి కూడా బుందేలీ బాషలో బ్లాగులు చేసి ఫేమస్ అయ్యింది. అయితే సోమవారం ఆ బాలిక సీఎం మోహన్ యాదవ్ ను కలిసేందుకు ఆయన అధికారిక నివాసానికి వెళ్లింది. అధికారులతో కీలక సమావేశంలో ఉన్న సీఎం ఆమెను పిలిపించుకున్నారు.
అనంతరం ఆమె సీఎంతో కలిసి అధికారుల సమక్షంలోనే బ్లాగ్ చేయడం ప్రారంభించింది. "రాం రాం ముఖ్యమంత్రి జీ" అంటూ బుందేలీ భాషలో బాలిక మాట్లాడటం చూసి సీఎం సైతం అబ్బురపోయారు. ఆ బాలిక వీడియోలో సీఎంను చూపిస్తూ.. ఆపకుండా మాట్లాడుతూ సీఎంను పొగడ్తలతో ముంచెత్తడం ఆయనకు తెగ నవ్వు తెప్పించింది. అంతేగాక బ్లాగ్ చివరలో సీఎం లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఫాలో చేయండి అని ఆడియన్స్ ను కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ముఖ్యమంత్రితో బ్లాగ్ లో నటించిన బిన్ను రాణి చానెల్ కు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది.