అదనపు కలెక్టర్ అక్రమ ఆస్తుల విలువ రూ. 30 కోట్లు

by Kalyani |   ( Updated:2024-10-22 10:47:31.0  )
అదనపు కలెక్టర్ అక్రమ ఆస్తుల విలువ రూ. 30 కోట్లు
X

దిశ, సిటీక్రైం : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకట భూపాల్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. 2 నెలల ముందు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికి జైలు పాలయ్యాడు. మంగళవారం మరో సారి ఏసీబీ అదనపు కలెక్టర్ అక్రమస్తుల ఫిర్యాదు పై అతని ఇంటి తో పాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ప్రభుత్వ ధర ప్రకారం అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డికి రూ. 5.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో రూ. 4.19 కోట్ల విలువ చేసే ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఓపెన్ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ రూ. 30 కోట్లు పై నే ఉంటుందని తెలుస్తోంది. ఈ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ ఏడాది అగస్టు 14 న ముత్యం రెడ్డి రైతుకు సంబంధించిన 14 గుంటల స్థలాన్ని ప్రోహిబిటెడ్ నుంచి తొలిగించేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ద్వారా రూ. 8 లక్షలు తీసుకుని ఏసీబీ అధికారులకు దొరికి జైలు కు వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed