- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందే హెచ్చరించిన ‘దిశ’...కూలిన కాజ్ వే
దిశ, మంగపేట : మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామానికి వెళ్లేదారిలో గౌరారం వాగుపై నిర్మించిన కాజ్ వే కూలి పోయింది. దీంతో బొమ్మాయిగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మాయిగూడెం కాజ్ వేకు బుంగపడి కూలిపోయే దశలో ఉందనే విషయాన్ని సోమవారం ’దిశ‘ జిల్లా టాబ్లాయిడ్ లో కథనం వచ్చిన విషయం పాఠకులకు విదితమే. సంబంధిత ఐబీ అధికారులు స్పందించి బుంగను పూడ్చాలంటూ కథనం వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో మంగళవారం ఉదయం కాజ్ వే మొత్తం గౌరారం వాగులో కూలిపోయింది. దీంతో బొమ్మాయిగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తూరు మోట్ల గూడెం పంచాయతీ హాబీటేషన్ పరిధిలోని బొమ్మాయిగూడెం గ్రామ ప్రజలకు ప్రతి పని కోసం కొత్తూరు మొట్లగూడెం లేదా సమీపంలోని కాటాపురం, మండల కేంద్రం మంగపేటకు రావాల్సి ఉంది. లోలెవల్ కాజ్ వే పూర్తిగా ధ్వంసమై గౌరారం వాగులో కూలిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గౌరారం వాగు నిత్యావసర పనుల కోసం దాటేందుకు గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాజ్ వే పనులు పునరుద్దరించే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.