సైబర్ మోసగాళ్ల నయా ట్రెండ్.. ప్రభుత్వ పథకం పేరుతో మోసం

by Aamani |
సైబర్ మోసగాళ్ల నయా ట్రెండ్.. ప్రభుత్వ పథకం పేరుతో మోసం
X

దిశ, జడ్చర్ల : సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. లోన్ లో స్కీములు, ఉద్యోగాలు, బ్యాంకుల పేరుతో మోసాలు చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ పథకాలను తమ ఫైబర్ మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ప్రజలు ఈ నేరాలపై అవగాహన కోల్పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతూ తమ సర్వస్వాన్నీ కోల్పోతున్నారు. ఇలాంటి సైబర్ ఘటనే జడ్చర్ల మండలం గంగాపూర్ లో తాజాగా వెలుగు చూసింది.

జడ్చర్ల మండలం గంగాపురం గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ రావడంతో ఎత్తి మాట్లాడాడు. అంతలోపే మీ భార్యకు మహాలక్ష్మి గ్రూప్ లో లోన్ వచ్చింది. బ్యాంకు వివరాలు చెప్తే మీకు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పాడు. విషయం అర్థం కాని చెన్నకేశవులు పక్కన ఉన్న వాళ్లకు ఫోన్ ఇచ్చాడు. భూత్పూర్ కి చెందిన మల్లేష్ వాళ్లకు తన అకౌంట్ ఇవ్వడంతో వాళ్లు ఇతనికి పేమెంట్ రిక్వెస్ట్ పంపారు. వారు చెప్పింది విని వీళ్ళ అకౌంట్ నెంబర్ ని ఫోన్ చేసిన సైబర్ స్కాం వ్యక్తికి ఇచ్చారు. వాళ్ళు ఫోన్ పే లో వీళ్లకు అమౌంట్ పంపించేది పోయి అమౌంట్ రిక్వెస్ట్ పెట్టారు. వీళ్ళు పే నౌ పిన్ నెంబర్ కొట్టగానే రెండు అకౌంట్ల నుండి సుమారు రూ. 1 లక్షా 75 వేలు పోయాయి.

విషయం తెలుసుకున్న వెంటనే సదరు బాధితులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో బాధితులు ఇద్దరు జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు సంబంధిత ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల పట్టణ ఎస్సై శివానంద్ తెలిపారు. ఇలా ఎవరు కూడా డబ్బులు ఫోన్లో వేయరని ఏదైనా నేరుగా తీసుకోవాల్సి ఉంటుందని ఎవరు ఫోన్ చేసి పిన్ నెంబర్ గాని అకౌంట్ నెంబర్ గాని అడిగిన స్కాన్ చేయమని చెప్పిన చేయకూడదని, అలా ఎవరైనా అడిగితే వెంటనే అప్రమత్తమైన అలాంటి నెంబర్ ను బ్లాక్ చేయడం తో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై శివ ఆనంద్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed