Blast In Factory: మధ్యప్రదేశ్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు

by Shamantha N |
Blast In Factory: మధ్యప్రదేశ్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా ఖమారియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎఫ్6 సెక్షన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈపేలుడులో తొమ్మిది మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, దాదాపు డజను మంది ఉద్యోగులకు కాలిన గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పేలుడు తర్వాత గందరగోళ వాతావరణం నెలకొనగా, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్-6 సెక్షన్‌లోని భవనం నంబర్ 200లో పేలుడు సంభవించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా జనరల్ మేనేజర్, ఇతర అధికారులు కూడా సంఘటన స్థలంలో ఉన్నారు. కానీ, ఘటనకు సంబంధించిన వివరాలపై ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది. గాయపడిన వారిని పరామర్శించేందుకు కాంట్ అసెంబ్లీ ఎమ్మెల్యే అశోక్ రోహని కూడా ఆస్పత్రికి వచ్చారు.

ఐదుకిలోమీటర్ల మేర పేలుడు

జబల్‌పూర్‌లోని సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ ఆర్డినెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఖమారియాలో మంగళవారం ఉదయం ఈ భారీ పేలుడు సంభవించింది. బాంబు నింపే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఫ్యాక్టరీలోని ఎఫ్-6 విభాగంలో బాంబు నింపే పని జరుగుతుండగా.. ఒక్కసారిగా హైడ్రాలిక్ సిస్టమ్ పేలింది. పేలుడు శబ్దం చాలా పెద్దగా వినపడినట్లు స్థానికలు తెలిపారు. దాని శబ్దం ఐదు కిలోమీటర్ల వరకు వినబడినట్లు తెలుస్తోంది. ఇక పేలుడు ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యమే కారణమన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed