Minister Komatireddy: నిజాం తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ కొత్త భవనం

by Gantepaka Srikanth |
Minister Komatireddy: నిజాం తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ కొత్త భవనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) పున:నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.49 కోట్లతో అసెంబ్లీని పునర్‌నిర్మిస్తామని తెలిపారు. ఈ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిజాం నిర్మించిన భవనం తరహాలోనే అద్భుతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ముఖ్యంగా పార్లమెంట్(Parliament) తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే.. వాహనాలు ఉపయోగించక తప్పడం లేదు.

రెండూ ఒకే దగ్గర ఉంటే టైవ్ సేవ్ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్‌ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో ఒక్క సీటు రాకున్నా, అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేద‌న్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు త‌మ ప్రభుత్వం ఇస్తోంద‌ని గుర్తుచేశారు. కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంత నిధులు తెచ్చారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed