పవర్ లిఫ్టర్ స్వప్నికకు రూ.లక్ష నగదు బహుమతి అందజేసిన మంత్రి కొప్పుల

by Shiva |   ( Updated:2023-08-30 14:46:31.0  )
పవర్ లిఫ్టర్ స్వప్నికకు రూ.లక్ష నగదు బహుమతి అందజేసిన మంత్రి కొప్పుల
X

దిశ, వెల్గటూర్ : అంతర్జాతీయ వేదికపై పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించిన స్వప్నికకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గురించి స్వప్నిక అంతర్జాతీయ వేదికైన షార్జాలో ఈనెల 16 నుండి 21 వరకు ఆసియా యూనివర్సిటీ కప్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో స్వప్నిక పాల్గొని 84 ప్లస్ కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించింది.

జగిత్యాల జిల్లాలోని మారుమూల పట్టణమైన ధర్మపురి నుంచి ఎంతో పట్టుదలతో శ్రమించి అంతర్జాతీయ వేదికపై బంగారు పతకాలు సాధించిన విరించి స్వప్నిక ధర్మపురి లోని క్యాంపు ఆఫీసులో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన స్వప్నిక సాధించిన బంగారు పథకాలను ఆమె మేడలో వేసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రతిభను కనబరచాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రోత్సాహకంగా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిని స్వప్నికకు రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు.

Advertisement

Next Story