- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్..
దిశ, జగిత్యాల ప్రతినిధి : ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో మచ్చలేని జీవితాన్ని గడిపానని అలాంటి తన మీద ఎన్నికల రికౌంటింగ్ గురించి తప్పు ఆరోపణలు చేయడం బాధించాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతుందని గుర్తు చేసారు. అలాంటి ఎన్నిక ఫలితాల మీద అనవసరపు ఆరోపణలు చేయడం సరికాదని డిసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ కు హితవు పలికారు. ధర్మపురి ఎన్నికల ఫలితాల పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఈవీఎం లను ధర్మపురి కాలేజీలో భద్రపరచి అక్కడి నుండి పోలీసుల బందోబస్తుతో వి.ఆర్.కె కళాశాలకు తరలించారన్నారు. ఎన్నికకు సంబంధించిన సీసీ కెమెరా ఒరిజినల్ పుటేజి నీ దగ్గరే ఉందని దానిని కోర్టులో సమర్పించి నీ చిత్తశుద్ధి చాటుకో అని హితవు పలికారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు తన చేతిలో ఉన్నాయని అనడం విడ్డూరం అని ఐఎ పిటిషన్ లు వేసి తీర్పు రాకుండా కేసును నిరుగారుస్తున్నది నువ్వే అన్నారు. న్యాయ వ్యవస్థ పైన ఏమాత్రం గౌరవం ఉన్న తీర్పు త్వరగా వచ్చేలా వ్యవహరించమని సూచించారు.