- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలస..
దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూత్ ప్రెసిడెంట్ గా పుల్లూరి సంతోష్ గౌడ్, కనకాల నాంపల్లి, బొంది నాగరాజు, ఉరది మహేష్, చేపయల సంతోష్, జక్కుల దేవరాజు, నాగుల చందు, బిట్ల మురళి, కాతురి గిరీష్, ముద్దుల ప్రవీణ్ రెడ్డి మంద సాయి, ఊరది చిన్న మహేష్ నాగరాజు, బిట్ల దేవేందర్, ఉరది సాయి కృష్ణ తదితరులు చేరినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట దళిత ముఖ్యమంత్రి చేశానన్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు దళితున్ని సీఎం చేయలేరని అలాగే దళితబంధు పథకాన్ని దళితులకి అందించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాలకు ఉద్యోగ అవకాశం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు వారిని అదుకొలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్ధి పార్టీలవైపు చూస్తున్న అసంతృప్తుల జాబితా కూడా పార్టీలో పెరిగిపోతోంది. ఏకంగా కొందరు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు ఎండి హమిద్, మండల నాయకులు గంగి స్వామి, లచ్చాయ్య, ఒరుగంటి నర్సింహులు, రామచంద్రారెడ్డి, విట్టల్ గౌడ్, యాదుల్లా, పంతం సురేష్ తదితరులు పాల్గొన్నారు.