- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లెలకు గంజాయి మత్తు.. అడ్డాలుగా రైల్వే స్టేషన్లు..
గంజాయి మహమ్మారి పల్లెల్లోకి విస్తరించి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత కళాశాలకు వెళ్తున్నామని, ఫీజులు, ఇతర ఖర్చుల పేరుతో తల్లిదండ్రుల వద్ద డబ్బు వసూలు చేసి గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మత్తులో ఇతర చెడుమార్గాల పట్ల ఆకర్షితులవుతున్నారు. కళాశాలలో విద్యార్థులు హాస్టళ్లు, లైబ్రరీ, కళాశాల వాష్ రూముల్లో గంజాయి మత్తులో గొడవలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మత్తులో విద్యార్థులు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో కేసులపాలై తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాగా అక్రమ సంపాదన కోసం కొంతమంది ముఠాలుగా ఏర్పడి పథకం ప్రకారం యువకులకు అలవాటు చేసి వారి ద్వారా గంజాయిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తమ అక్రమార్జనకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. గాంజా మత్తులో పడిన యువకులు డబ్బుకోసం దొంగతనాలకు సైతం పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మత్తులో విద్యార్థినుల జీవితాలను సైతం నాశనం చేయడానికి వెనుకాడడం లేదంటే అతిశయోక్తి లేదు.
దిశ, హుజూరాబాద్ : గంజాయి మహమ్మారి పట్టణాలతో పాటుగా పల్లెల్లోకి విస్తరించి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతతో పాటుగా పట్టణ ప్రాంతాల్లోని యువత కళాశాలకు వెళుతున్నామని, ఫీజులు, ఇతర ఖర్చుల పేరుతో తల్లిదండ్రుల వద్ద డబ్బు వసూలు చేసి ఆ డబ్బుతో గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మత్తులో ఇతర చెడుమార్గాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. కళాశాలలో విద్యార్థులు హాస్టళ్లు, లైబ్రరీ, కళాశాల వాష్ రూముల్లో గంజాయికి అలవాటు పడి గొడవలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మత్తులో విద్యార్థులు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో కేసులపాలై తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాగా అక్రమ సంపాదన కోసం కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఒక పథకం ప్రకారంగా యువకులకు అలవాటు చేసి వారి ద్వారా గంజాయిని వ్యాప్తి చేస్తున్నారు. దీంతో తమ అక్రమార్జనకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. గంజాయి మత్తులో తమ జీవితాలతో పాటుగా మిగతా వారి జీవితాలు సైతం నాశనం చేస్తున్నారు. గాంజా మత్తులో పడిన యువకులు డబ్బు దొరకకపోతే దొంగతనాలకు సైతం పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మత్తులో విద్యార్థినుల జీవితాలను సైతం నాశనం చేయడానికి వెనుకాడడం లేదంటే అతిశయోక్తి లేదు.
రైల్వే స్టేషన్లే అడ్డాలు...
గాంజా ముఠా సభ్యులు రైల్వే స్టేషన్లను తమ అడ్డాగా చేసుకొని కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జమ్మికుంట, ఉప్పల్ స్టేషన్లు ఉన్నాయి. పక్కనే హాసన్‌పర్తి స్టేషన్ ఉంది. వీటి పరిధిలో పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని గంజాయి ముఠా సభ్యులు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. భద్రాచలం నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటుగా పరకాల ప్రాంతాలకు విస్తరించి గాంజా ముఠా తమ సామ్రాజ్యాన్ని వ్యాప్తిచేస్తున్నాయి. శుక్రవారం హాసన్‌పర్తి మండలం పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు గంజాయి పీల్చుతుండగా పట్టుకొని హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరీ లింక్ హుజూరాబాద్, కరీంనగర్, పరకాల వరకు విస్తరించినట్లు సమాచారం. కళాశాలల్లో గంజాయికి బానిసలైన యువకులు మిగతా వారికి విక్రయిస్తున్నారు. ఈ దందా నిరాటంకంగా కొనసాగుతుంది.
పట్టణాల నుంచి గ్రామాలకు..
పట్టణాల నుంచి ఈ దందా మెల్లమెల్లగా గ్రామాలకు విస్తరిస్తుంది. గ్రామాల్లోకి యువకులు గ్రామాల శివారులోని పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలను అడ్డాలుగా చేసుకుని గాంజా పీలుస్తూ ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరాలకు పాల్పడే వారిలో ఎక్కువగా యువకులే ఉండడంతో పోలీసులు విచారించగా వీరు గాంజా మత్తులో చేస్తున్నట్లు గుర్తించి పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అయినా ఈ దందా ఆగడం లేదు. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువకులు అవి లేకపోతే ఎలా తల్లడిల్లిపోతాడో అలా గాంజా లేకపోతే సదరు యువకులు తల్లడిల్లి పోతున్నారని తెలుపుతున్నారు. గాంజాకు అలవాటుపడిన యువకులు డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రుల పై దాడులు చేస్తున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. దొంగతనాలు, లైంగికదాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి కొంతకాలం పాటు చర్యలు తీసుకుంటే తప్ప అరికట్టే అవకాశం లేదు. గతంలో గుడుంబా అరికట్టిన విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.