- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur: మణిపూర్ లో కుకీల అరాచకాలు.. ముగ్గురి డెడ్ బాడీలు లభ్యం
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో(Manipur) కుకీల(Kuki) అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. జిరిబామ్(Jiribam)లో ఈనెల 11న కిడ్నాప్ నకు గురైన ఆరుగురిలో ముగ్గురి డెడ్ బాడీలు లక్ష్యమయ్యాయి. ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం అసోం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో డెడ్ బాడీలు తేలుతూ కనిపించాయి. పోస్టుమార్టం నిమిత్తం ముగ్గురి డెడ్ బాడీలను పోలీసులు సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. “జిరి నదిలో మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీని తర్వాత అసోం రైఫిల్స్ సైనికులు వారిని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు ఇంకా మృతదేహాలను గుర్తించలేదు. కానీ వారి వివరణలు తప్పిపోయిన ఆరుగురిలో ముగ్గురితో సరిపోలుతున్నాయి.” అని తెలిపారు.
కుకీ మిలిటెంట్ల దాష్టీకం
ఇకపోతే, జిరిబామ్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు(Kuki militants) నవంబర్ 11న మధ్యాహ్నం 3:30 గంటలకు జిరిబామ్ జిల్లాలోని బోరోబెకరాలో పోలీసు స్టేషన్‌పై దాడి జరిగింది. దాడిచేసేందుకు వచ్చిన వారిలో పది మంది సాయుధ కుకీలను భద్రతా దళాలు హతమార్చారు. కాగా.. ఆ దాడి తర్వాత వారు మైతేయి కమ్యూనిటీకి(Meitei community) చెందిన ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో, వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావించారు. ప్రస్తుతం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.