- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyber Crime: పోలీసులమంటూ పరిచయం.. రూ.1.25 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
తాజాగా, విజయవాడ (Vijayawada)కు చెందిన ఓ యువతి హైదరాబాద్ (Hyderabad)లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇటీవలే ఆమె తన తల్లిదండ్రులకు చూసేందుకు గురువారం విజయవాడ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను ముంబై పోలీస్ (Mumbai Police) అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ (Drugs), ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని.. అది చట్టరీత్య నేరమని యువతిని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించాడు. దీంతో కంగారు పడిన యువతి పలు దఫాలుగా కేటుగాడి అకౌంట్‌కు రూ.1.25 కోట్లు పంపింది. అనంతరం తాను మోసపోయినట్లుగా గ్రహించిన యువతి శుక్రవారం రాత్రి సైబర్ క్రైం (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేసింది.