- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీ కానీ రైతులు గ్రీవెన్స్ లో నమోదు చేసుకోవాలిః జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి : రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందకుండా గ్రీవెన్స్ లో నమోదు చేసుకోవాలని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ జరగని రైతులు ఆందోళన చెందడం సహజమని.. అయితే ఆధార్ మిస్ మ్యాచ్ లాంటి సాంకేతిక సమస్యలు సరి చేయగానే మాఫీ జరుగుతుందన్నారు. రేషన్ కార్డు కేవలం వివరాల కోసమే అని ప్రామాణికం కాదని రేషన్ కార్డు లేకున్నా అర్హులైన రైతులకు రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు రెండు లక్షల పైన రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ జరుగుతుందని అయితే పైచిలుకు మొత్తాన్ని ముందుగా చెల్లించాలని సూచించారు. ఇప్పటికే 90% పైగా రైతులకు రుణమాఫీ జరిగిందని జిల్లాలో మొత్తం 69,673 మంది రైతులకు రూ.532 కోట్లు రుణ మాఫీ అమలు కాగా 3,500 మంది రైతులకు జరగాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ సర్కార్ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. విపక్షాలు విమర్శలు మాని రైతులను గైడ్ చేయాలని హితవు పలికారు. ఇక బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి రుణ మాఫీ చేయలేదని కేవలం అంబానీ అదాని కి ఏం చేయాలో అని మాత్రమే చూస్తారని చురకలు అంటించారు.