- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాజంపై అత్యంత ప్రభావం చూపేది సాహిత్యం
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సమాజంపై అత్యంత ప్రభావం చూపేది సాహిత్యం లోక కవి వాగ్గేయ కారుడు అందెశ్రీ అన్నారు. ఆదివారం రంగినేని ట్రస్ట్ లో రంగినేని ఎల్లమ్మ 2024 సాహిత్య పురస్కారానికి రెప్పవాల్చని రాత్రి కవి వంశీకృష్ణకు అందజేశారు. సమావేశంలో కవి అందెశ్రీ మాట్లాడుతూ… లోక హితం కోరే కవిత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. వంశీకృష్ణ మనిషిని కేంద్రంగా చేసుకొని తన కవిత్వాన్ని ఆవిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో వంశీకృష్ణ నుంచి మరింత కవిత్వం రావాల్సి ఉందన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ సాహిత్యాన్ని ఆదరిస్తున్న రంగినేని ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఈనాడు తెలంగాణ సంపాదకులు డీఎన్ ప్రసాద్, తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు జూకంటి జగన్నాథం, రంగినేని మోహన్ రావు, మద్దికుంట లక్ష్మణ్, నవీన్ కుమార్, నారాయణ శర్మ పలువురు కవులు రచయితలు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు