- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అబద్దాల హరీష్.. నోరు తెరిస్తే తప్పుడు మాటలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతాడని.. ఆ అబద్దాల పునాదులపైనే బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం రాష్ర్ట ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలను రఘునందన్ రావు తప్పుబట్టారు.
గవర్నర్ ను రాష్ర్ట ప్రభుత్వం అడుగడునా అవమానించిందని కనీసం కలెక్టర్లను కలవనివ్వకుండా.. పోట్రోకాల్ పాటించకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యకి యోక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్ధ ఒక స్వాతంత్ర్య ప్రతిపత్తి కలిగిన పదవి అని.. దానికి బీజేపీకి ఏలాంటి సంబంధం ఉండదన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియమాకాలుపై జరిగిందని టీ.ఎస్.పీ.ఎస్.సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు.
కామన్ రిక్రూట్మెంట్ బోర్డును 2014లో ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ కారాబద్ చేస్తుందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్నేతలు ఆరోపిస్తున్నారని తెలంగాణలో వేసిన సిట్లు ఎన్ని మీరు వేసిన సిట్లు ఎన్ని తుది నివేదికలు ఇచ్చిందని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఫైల్‌పై గవర్నర్ సంతకం పెట్టడం లేదని మంత్రి హరీష్ మాట్లాడడం హాస్యస్పదంగా ఉందని రఘునందన్ రావు అన్నారు.