ఎక్కడికక్కడా అరెస్టులు

by S Gopi |
ఎక్కడికక్కడా అరెస్టులు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడా పోలీసులు అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను నేడు ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పోలీసులు ఉదయం నుంచి కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తమను అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

Advertisement

Next Story