"సుకన్య" స్పెషల్ డ్రైవ్ సక్సెస్

by S Gopi |
సుకన్య స్పెషల్ డ్రైవ్ సక్సెస్
X

దిశ, కరీంనగర్ టౌన్: ప్రతి ఇంటిలో పదేళ్లలోపు ఉండే అమ్మాయిల పేరిట సుకన్య ఖాతాలు తెరవాలనే లక్ష్యంతో కరీంనగర్ డివిజన్ వ్యాప్తంగా గురు, శుక్రవారం రెండురోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కు ప్రజల నుంచి మంచి స్పందన లబించిందని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. భారత తపాలా శాఖ అమృత్ పెక్స్ ప్లస్ 2023 సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవడం కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాలు స్పెషల్ మేళాలు ఏర్పాటు చేయగా, రికార్డు స్థాయిలో సుమారు 3500 అమ్మాయిలకు సుకన్య ఖాతాలు తెరిచినట్లు వివరించారు. సుకన్య ఖాతాలు తెరవడంలో సర్కిల్ స్థాయిలో కరీంనగర్ డివిజన్ రెండవ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇంకా సుకన్య ఖాతాలు తెరవని తల్లిదండ్రులు మీ పిల్లల బంగారు భవిష్యత్ గురించి ఆలోచన చేసి సుకన్య ఖాతాలు ఓపెన్ చేసుకోవాలని కోరారు. రెండు రోజులపాటు నిర్వహించిన సుకన్య ఖాతాల మేళాలకు సహకరించి విజయవంతం చేసిన బాలికల తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, విశేష ప్రచారం కల్పించిన ప్రింట్ అండ్ మీడియాకు, పోస్టల్ సిబ్బందికి పోస్టల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed