దశాబ్ది పాలనతో తెలంగాణ దిశ మార్చిన కేసీఆర్.. : కోరుకంటి

by Aamani |
దశాబ్ది పాలనతో తెలంగాణ దిశ మార్చిన కేసీఆర్.. :  కోరుకంటి
X

దిశ, పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర మరవలేనిదని, దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ తెలిపారు. రాఘవాపూర్ లోని స్థానిక తెలంగాణ భవన్ లో ఆయన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ సుభిక్షమైన పాలన అందించారాని రైతులకు రైతు బంధు, రైతు బీమా తో పాటు వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లను పెంచి అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

తమ పది సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దూసుకు పోయిందని, తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంగా జరుపుకుంటున్న దశాబ్ది ముగింపు ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో నాయకులు జూన్ 1న హైదరాబాద్ లో జరిగే దశాబ్ది ఉత్సవ ముగింపు కార్యక్రమంలో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని అయినా పిలుపునిచ్చారు. జూన్ 2న హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా పెద్దపల్లిలో స్థానిక నాయకులతో పెద్దపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ తో పాటు పెద్దపల్లి, రామగుండం కి చెందిన పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed