ఆపరేషన్ భల్లూకం సక్సెస్ అవుతుందా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-13 16:02:14.0  )
ఆపరేషన్ భల్లూకం సక్సెస్ అవుతుందా?
X

దిశ, తిమ్మాపూర్: శాతవాహన యూనివర్శిటీ ప్రాంగణంలో భల్లూకం ఒకటే ఉందా? లేక మరిన్ని ఉన్నాయా? ఫారెస్టు సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌ భల్లూకం సక్సెస్‌ అవుతుందా ? బావుల దగ్గర ఏర్పాటు చేసిన బోనులో భల్లూకం చిక్కుతుందా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సిబ్బంది సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. యూనివర్శిటీలో ఉన్న చిట్టడవిలో రెండు పెద్దబావుల వద్దకు నీటికోసం ఎలుగుబంట్లు వస్తాయని భావిస్తున్నారు. భల్లూకాన్ని బోనులో బంధించేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే భల్లూకాన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ ఆపరేషన్ కొనసాగుతున్న సందర్భంగా మార్చి 14,15 తేదీలలో అన్ని తరగతులను నిలిపివేస్తున్నట్లు డాక్టర్ ఎం.వరప్రసాద్ రిజిస్ట్రార్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా క్యాంపస్ విద్యార్థులందరూ (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్,యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్స్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్‌మెంట్) 2022 తరగతుల విద్యార్థులు హాస్టలోనే ఉండాలని సూచించారు. అయితే టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ విధులకు హాజరుకావాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed